వికాస్ స్కూల్‌లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్–2 విజయవంతం

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 6 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండల కేంద్రంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో గురువారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్-2 కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 1, 2 మరియు 3వ తరగతి విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిన్నారులు రూపొందించిన వివిధ విద్యా ప్రాజెక్టులు అక్కడికి వచ్చిన అతిథులు, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి వివరంగా వివరిస్తూ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి-2 కాటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథులుగా స్థానిక కెనరా బ్యాంకు మేనేజర్ విడవలూరు ప్రవీణ్ కుమార్, మండల జనవిజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య పాల్గొన్నారు.పాఠశాల కరెస్పాండెంట్ షేక్ ఖాదర్ వలి, డైరెక్టర్ షేక్ జిలానీ, ప్రధానోపాధ్యాయులు గుత్తి పెంచల ప్రసాద్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అతిథులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *