
పయనించే సూర్యుడు మార్చ్ 6 దౌల్తాబాద్ రాజేష్) సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండల కేంద్రంలోని అందే గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్మించినటువంటి చేతనగ్రామీణ వికాస సేవ సమితి ఆధ్వర్యంలో మరియు సామాజిక సమరసత వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముందుగా సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగనే క్యాలెండర్ మరియు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని సూచించారు. పదవ తరగతి పిల్లలకు ఎగ్జామ్ టైమ్ లో ధైర్యంగా ఉండి ఎగ్జామ్ రాసి అందరికీ మంచి పేరు తేవాలని వారు పేర్కొన్నారు. మరియు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి చదువుపై దృష్టి సాధించాలని చెడు అలవాట్లు మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. బుద్ధిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల స్కూల్ నుండి పిల్లలు రావడం జరిగింది. అందే కొండాపూర్ గుడికందుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందే పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి. గ్రామ ఉపసర్పంచ్. మాట్ల పరశురాములు. వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా అలాగే వార్డు సభ్యులు జక్కుల మహేష్. చేతన గ్రామీణ వికాస సేవ సమితి సభ్యులు సూకూరి పోచయ్య. కడారి కనకరాజు. గణపురం సంతోష్. తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు