మండిగిరి పంచాయతీ 630 సర్వేనెంబర్ లో 3.33 ఎకరాలు కబ్జాకు

* గురైన స్పందించని ఎమ్మార్వో ఆర్డీవో అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 6 కర్నూల్ జిల్లా ఇన్చార్జెస్ శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఒక చిన్న సమస్య రాకుండా మరియు ప్రజలతో అన్యోన్యంగా ప్రతి ఒక్క నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు ఉండాలని చిత్తశుద్ధితో ఈ వయసులో కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మండగిరి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 630 లో 3.33 ఎకరాలు కబ్జా జరిగిందని ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో వచ్చింది కానీ ఇంతవరకు ఆదోని ఎమ్మార్వో కానీ ఆర్ డీవో కానీ స్పందించలేదు ప్రవేట్ ల్యాండ్ లేదా ప్రభుత్వ ల్యాండ్ తేల్చి చెప్పాల్సిన అధికారం మీకు ఉంది కానీ ఇంతవరకు ఏం అయింది ఏం జరిగింది పని ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వ అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అయితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పేద ప్రజల కు ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్లు ఇస్తామని చెప్పినారు అదేవిధంగా ఆ భూమిని ప్రభుత్వ భూమి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచాలని వ్యక్తం చేసినారు కబ్జా చేసిన ఏ వ్యక్తి అయినా సరే చట్టపరంగా శిక్ష తప్పదు మరియు ఇలాంటి విషయాలు ముందు ముందు జరగకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు మళ్ళీ ఇలాగే జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి వెనకాడనని పేర్కొన్నారు అలాగే అధిష్టానానికి కూడా తీసుకెళ్తానని చెప్పినారు ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులు చూసుకోవాలని తమ పనిని తాము చేసుకుంటూ పోవాలని హెచ్చరించారు ప్రజలకు సేవ పరంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ అండగా ఉండాలి తప్ప కబ్జాదారులకు రౌడీలకు పనిచేసే అధికారులు కాకూడదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *