మల్లేశం పల్లి ప్రాథమిక పాఠశాలలో, ఉపాధ్యాయులైన, విద్యార్థులు

* "ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం" * "విద్యార్థులతో, మండల విద్యాధికారి గజ్జల కనకరాజు"

పయనించే సూర్యుడు మార్చి 6 దౌల్తాబాద్ రాజేష్ దౌల్తాబాద్ మండలం , గ్రామం, మల్లేశంపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా, నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి పాఠశాల నిర్వహణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గజ్జల కనకరాజు సార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల పాత్రను తెలుసుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులు ఎంఈఓ గా జగదీష్, హెచ్ఎం గా అభిరామ్, ఉపాధ్యాయులుగా కృతిక్, చరణ్, అయాన్ ,గాయత్రి, మధుశ్రీ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు యశోద పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *