ఎస్సీ కాలనీ స్మశానవాటికకు అభివృద్ధి పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు మార్చి 06, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలోని పాతర్లపాడు గ్రామంలో బీసీ కాలనీ సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీ స్మశానవాటికలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం స్మశానవాటికలో పెరిగిపోయిన కంపలు, చెట్లను తొలగిస్తూ శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో స్మశానవాటిక దయనీయ పరిస్థితిలో ఉండేది. ముఖ్యంగా వర్షాకాలంలో శవాలను పూడ్చడానికి కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను గుర్తించిన గ్రామ పాలకవర్గం స్మశానవాటిక అభివృద్ధి కోసం చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాతర్లపాడు సర్పంచ్ ఓబీనబోయిన లక్ష్మి, ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కోసం పాలకవర్గం తీసుకుంటున్న చర్యలను గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *