రైతులు, తమ ఉత్పత్తులను అమ్మడానికి ఏర్పాటు చేసిన అంగడి బజారు(సంత)ను అందరు వినియోగించుకోవాలి

* ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి * బూర్గుల గ్రామంలో అంగడి బజారు(సంత) ప్రారభోత్సవం * ప్రారభోత్సవంలో పాల్గొన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రైతులు, తమ ఉత్పత్తులను వారంలో ఒకరోజు ఒకేచోట అమ్మడానికి ఏర్పాటుచేసిన అంగడి (సంతను) వినియోగదారులు ఉపయోగించుకొవాలని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఏర్పాటు చేసిన అంగడి బజారు (సంత) ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన తాజా వ్యవసాయ ఉత్పత్తులు దొరికే ప్రదేశం అంగడని ఇటువంటి అంగడి (సంతను)లో అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి గ్రామ పెద్దలు మరియు పాలకవర్గం ఆలోచన మేరకు ఏర్పాటుచేసిన ఈ అంగడి బజారును(సంతను) వినియోగించుకొని గ్రామ మరియు రైతన్నల అభివృద్ధిలో పరిసర గ్రామాల ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కోరుకున్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినకు పాలకవర్గానికి శాలువుతో సత్కరించి సన్మానించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బూర్గుల గ్రామ సర్పంచ్ సి.రాజగోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ శివలీల రాజేందర్, మరియు పాలక మండలి, మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్, కసిరెడ్డి గూడ సర్పంచ్ లింగం గౌడ్, కుందేళకుంట సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచ్ డ్యాగ శంకర్,నేరెళ్ల చెరువు సర్పంచ్ భూపాల్ యాదవ్, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్, సి పోచయ్య, సి ప్రభాకర్, సి ఎల్లయ్య,లోకేష్ నాయక్, రమేష్ గ్రామ ప్రజలు పలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *