
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 బోధన్: హోలీ పండుగ సందర్భంగా సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో గ్రామ పెద్దలు బసవంత్ రావు పటేల్, సర్పంచ్ శీలం నర్మదా సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ మరియు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు కుస్తీలు పట్టడానికి తరలివచ్చారు.కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ పెద్దలు నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.