బోధన్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్లకు కంటి పరీక్షలు.

* ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 బోధన్: రాష్ట్ర డిజిపి శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నేతృత్వంలో బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో లయన్స్ క్లబ్ బోధన్ వారి సహకారంతో ఆర్టీసీ సిబ్బంది మరియు బోధన్ ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు మరియు వినికిడి పరీక్షలు గురువారం నిర్వహించారు.కంటి సమస్యలు ఉన్న డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేశారు.ఈ సందర్భంగా ఏసీబీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలు నడిపే డ్రైవర్లు కచ్చితంగా కంటి మరియు వినికిడి పరీక్షలను చేసుకుని సమస్యలు లేనట్లయితే వాహనాలను నడపాలని సూచించారు.ఈ సమస్యలు ఉన్న డ్రైవర్లు తప్పనిసరిగా డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ సమస్య పరిష్కారం అయిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలన్నారు.ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.సుమారు 100 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలను చేసినట్లు కంటి వైద్యులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వెంకటనారాయణ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బసవేశ్వర రావు శ్రీనివాస్ పోలీస్ శాఖ సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *