పయ నించే సూర్యుడు, మార్చి 6/2026 ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం మండల అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో మండల స్థాయి సంస్థాగత కమిటీని అధికారికంగా ప్రకటించారు. పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం “సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని పేర్కొన్నారు. బిజెపి పార్టీ సిద్ధాంతమైన రాష్ట్రప్రేమ, సేవా భావం, పారదర్శక పాలన మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే “వికసిత్ భారత్ – మోదీ గ్యారంటీ” నినాదంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పేదలు, రైతులు, మహిళలు, యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయడం ప్రతి బిజెపి కార్యకర్త బాధ్యత అని అన్నారు. ముమ్మిడివరం మండలంలో బిజెపిని మరింత బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని విస్తరించే దిశగా కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మండల సంస్థాగత కమిటీలో నియమితులైన నాయకులు: ప్రెసిడెంట్ సన్నిధిరాజు వీరభద్ర శర్మ, వైస్ ప్రెసిడెంట్లు జగతా రామారావు, పత్సమట్ల గణేష్ వర్మ, గాడ మేరీ, మట్టపర్తి కృష్ణార్జున రావు, పెనుమాల శాంతి శ్రీ, కొయ్యల వీర వేణి, ప్రధాన కార్యదర్శిలు జనిపెళ్ళ శ్రీనివాసరావు, కొప్పిశెట్టి బాల వెంకట కిషోర్, కార్యదర్శిలు బసవ శ్రీ హరిబాబు, వనిమిశెట్టి సతీష్, వాడ్రేవు చరిష్మా, దొమ్మేటి బాలరాజు, కొప్పిశెట్టి వెంకటలక్ష్మి, కుడిపూడి దుర్గాప్రసాద్, కోశాధికారి రెడ్డి వల్లి సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జోనల్ ఇంచార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, , వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకటరెడ్డి, డైరెక్టర్ మట్ట సూరిబాబు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
