ఘనంగా అంబేద్కర్ 135వ జయంతిని జరుపుకుందాం

* జైభీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ * రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 06 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంత్రాలయం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జైభీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 14న మంత్రాలయం టౌన్‌లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద డప్పుల సందడి, కోలాటాలు, జానపద గేయాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు మరియు మాదిగ సమాజ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *