పయనించే సూర్యుడు మార్చి 6 2026: ముమ్మిడివరం అంబేద్కర్ కోనసీమ బీజేపీ జిల్లా ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి పితాని వెంకటేశ్వరరావు వారి తల్లి మరణంతో దుఃఖభారానికి గురైన కుటుంబాన్ని పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించి, ఓదార్పు పలికారు. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామంలోని వెంకటేశ్వరరావు వారి స్వగృహంలో జరిగిన ఈ సంతర్పణ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిక్కా సత్యనారాయణ మరియు జిల్లా, మండల స్ధాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, “వెంకటేశ్వరరావు వారి తల్లి మరణం మాకు అపారమైన దు:ఖాన్ని కలిగించింది. పార్టీ కుటుంబంగా మేము వారి దుఃఖంలో పాలుపంచుకుంటూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండమని, మా పార్టీ ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటుందని” అని ఓదార్చారు. మండల ఉపాధ్యక్షుడు కోల గోపాలకృష్ణ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మేడిది సత్యనారాయణ, జిల్లా నాయకుడు తోలేటి సుబ్బారావు తదితరులు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి, పార్టీ స్థాయి నుంచి సానుభూతి తెలియజేశారు, వెంకటేశ్వరరావు గారు పార్టీలో ఓ బి సి మోర్చా ద్వారా చేస్తున్న సేవలు, సామాజిక కార్యక్రమాల్లో అందించిన కృషి పార్టీ నాయకులు ప్రశంసించారు. “ఈ దుఃఖాన్ని అధిగమించి, మరింత శక్తివంతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని” అని ప్రోత్సహించారు. బీజేపీ పార్టీ, తన కార్యకర్తల ఆరోగ్యం, దుఃఖ సమయాల్లో పక్కనుండి నిలబడటానికి తప్పనిసరి అని తెలిపింది.