ప్రతి ఒక్కరికి శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 06.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజా) ప్రతి ఒక్కరికి శాస్త్రీయ పరిజ్ఞానం అవసరమని ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మలు అన్నారు మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల నందు సైన్స్ యూజెస్ ఇన్ డైలీ లైఫ్ అనే అంశంపై ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోనూ మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు ఇందులో భాగంగా కోటూరు ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థి గురు కార్తీక్ ఏడవ తరగతి విద్యార్థి మహమ్మద్ యాసిన్ చౌడేపల్లి జెడ్పిహెచ్ఎస్ ఎనిమిదవ తరగతి విద్యార్థులు చారాల పాఠశాల నుంచి మధుప్రియ ఎం కీర్తి పుదిపట్ల పాఠశాల నుంచి చందన ముని సాయి ప్రశాంత్ లు గెలుపొందారు ఉపాధ్యాయుల సెమినార్లో నారాయణప్ప గెలుపొందారు ఈనెల 6న వీరు ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని ఎంఈవోలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు రమేష్ రమణ సుబ్రహ్మణ్యం ఆనంద్ తేజస్విని అరుంధతి పూర్ణిమ ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ వసంత పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *