ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 అరకులోయ టౌన్ రిపోర్టర్ అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ మండలకేంద్రంలో చింతపండు కిలో పిక్కతో 100 రూపాయలు జీడి పంటకు కిలో 200 రూపాయలు పసుపు పంటకు కిలో200 రూపాయలు మరియు అటవి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పెంచాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి బృందమైన కిల్లోసురేంద్ర, ఏ.అశోక్, కె.చిన్నంనాయుడు, టి. రామక్రిష్ణ, అధ్యర్యంలో విశాఖపట్నంలోని గిరిజన సహకార సంస్థ ఎండీ శ్రీమతి ఎస్, ఎస్ శోభిక ఐఏఎస్ వినతిపత్రం అందించడం జరిగింది అనంతరం జరిగిన సమావేశంలో పాడేరు, పార్వతీపురం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాల్లో వందలాది మంది ఆదివాసులు చింతపండుపై ఆధారపడి జీవిస్తున్నారు ప్రభుత్వం జీసీసీ ప్రస్తుతం చింతపండు పిక్కతో కిలో 36 రూపాయలు ఇస్తుంది బయట వర్తకులు 60 నుండి 70 రూపాయలు వరకు కొనుగోళ్లు చేస్తున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని పిక్కతో కిలో చింతపండు 100 రూపాయలు పిక్క తీసిన చింత పండు కిలో 150 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరారు జీడి పంట రైతులు అల్లూరిసీతరమరాజు, పోలవరం, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఆదివాసీ ప్రజలు వేలమంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు కిలో జీడి పంటకు 200 రూపాయలు గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆదుకోవాలని వివరించారు అటవి ఉత్పత్తులైనా చీపురు, పసుపు, తదితర వాటిపై గిట్టుబాటు ధరలు ప్రభుత్వం పెంచి ఆదివాసులకు అందుకోవాలని తెలియజేశారు ఏం డి సానుకూలంగా స్వాందించీ గిట్టుబాటు ధరలు కల్పించుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకూని వెళుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు ఎన్.అప్పన్న, ఎస్, అప్పారావు టి.సోములు, ఈ సిరిమల్లిరెడ్డి, పీ.నాగేశ్వరరావు పాల్గొన్నారు ధన్యవాదములు కె. సురేంద్ర
(ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *