పయనించే సూర్యుడు: మార్చి 7/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేం నరేంద్ర రెడ్డి ని, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేక ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వేం నరేంద్ర రెడ్డి కి రాగమయి తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో వేం నరేంద్ర రెడ్డి బలమైన గొంతుకను వినిపిస్తారనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.