అల్లిపూర్‌లో ఘనంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎంబారీ గౌతమి వెంకటేష్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, గ్రామాభివృద్ధి కోసం శ్రమదానం కార్యక్రమంతో పాటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది కలిసి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ హైస్కూల్ పరిసరాలను శుభ్రం చేసి శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌతమి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడడం, గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్‌చార్జ్ సెక్రెటరీ శ్రీహరి, కారాబర్ రాజేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు మందుల రాధ, ఉరుమడ్ల దీపిక, అటకాపురం భవాని, అత్తినేని వనితతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *