ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 7, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన 99 రోజుల ప్రత్యేక ప్రజా పాలన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్త వెంకటగిరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య ప్రణాళిక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గ్రామంలో పారిశుద్ధ్య లోపాన్ని మురికి నీటిపారుదల సౌలభ్యానికి కావలసిన తగు చర్యలను తీసుకోవడం జరిగింది అనంతరం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై రాబోవు రోజుల్లో సమస్యల పరిష్కారానికి కావలసిన ప్రణాళికపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యలపై సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావుకు విన్నవించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *