సీపీఐ(ఎం) సభ్యురాలు సరోజిని మృతి

* నివాళులు అర్పించిన జిల్లా నాయకులు చిరంజీవి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని ముద్దులగూడెం కు చెందిన సీపీఐ(ఎం) సభ్యురాలు నారం సరోజిని అనారోగ్యం శుక్రవారం మృతి చెందారు. స్థానిక శాఖా కార్యదర్శి,మండల కమిటీ సభ్యులు నారం అప్పారావు ద్వారా సమాచారం తెలుసుకున్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బీ.చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ లు సరోజిని భౌతిక కాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని దేహం పై కప్పి నివాళులు అర్పించారు. సరోజిని భర్త నారం వీరేష్ సైతం పార్టీ లో కొనసాగుతూనే ప్రమాదానికి గురై మృతిచెందాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు జీలుగుపల్లి మండలం మడకం వారి గుంపు లో ఉన్న తన కూతురు దగ్గర చూడటానికి వెళ్లి,అక్కడే అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించింది. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కుంజా మురళి,నారం శ్రీదేవి,నారం పెదవేంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *