సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు, మార్చి 07, బూర్గంపాడు మండలం రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లో శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సాయంత్రం 6 గంటల నుండి స్వామి వారికి అభిషేకము, సంకష్టహర చతుర్థి ,వ్రత కథ, ఉపవాసం ఉన్న భక్తులచే చంద్ర తర్పణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగినది . ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు , భక్తుల స్వా హస్తాలతో స్వామి వారికి అభిషేకం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నారు, ప్రతినెలా కూడా సంకటహర చతుర్థి సందర్భంగా ఉపవాసము ఉండి స్వామి వారికి అభిషేకం చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *