పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం డిఇఓ బాలాజీ రావు

పయనించే సూర్యుడు మార్చి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) పదోవ తరగతి పరీక్షలను ఒక క్రమ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారి బాలాజీ రావు అధికారులకు సూచించారు.. డీఈవో జానకిరామ్ తో కలిసి ఆత్మకూరులో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాలకు సంబంధించిన ఎంఈఓ లు, హెడ్మాస్టర్ లు, చీప్, సూపర్డెంట్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరీక్షలు నిర్వహణలో తీసుకోవాల్సిన పలు సూచనలు చేశారు.నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లలో తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సరి చూసుకోవాలని తెలిపారు. హాజరైన వారి నుండి పలు సూచనలు సలహాలు తీసుకొని వాటిని పాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ప్రధానోపాధ్యాయులు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *