బిజినపల్లి మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

* కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిద్దె రాములు ఎమ్మార్వో మునీరుద్దీన్

పయనించే సూర్యుడు మార్చి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు తమకు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల అధ్యక్షులు మిద్దె రాములు, ఎమ్మార్వో మునీరుద్దీన్, డీసీసీ ఉపాధ్యక్షులు పర్వతాలు, మిద్దె శ్రీను, ఎండి ముక్తార్, ఎండి నజీర్ తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ముఖ్య నాయకులు, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *