పయనించే సూర్యుడు మార్చి 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు విజయవాడలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.ఇదే సందర్భంగా పురపాలక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ ను కూడా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే “పిల్లి” దంపతుల వెంట మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, క్లస్టర్ లు తాతపూడి రామకృష్ణ, కొమరిశెట్టి నరసింగ రావు తదితరులు ఉన్నారు.