శయనోత్సవంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవములు :

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి, 07 03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) ఫిబ్రవరి23 నుండి ప్రారంభమైన పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 05.03.2026 రాత్రి ఆలయంలోని అద్దాల మండలంలో నిర్వహించిన శయనోత్సవంతో ఘనంగా ముగిసాయి… ఇందులో భాగంగా 05.03.2026 బుధవారం ఉదయం 07.00 గంటలకు శ్రీవారి మూలమూర్తికి 108 లీటర్ల పాలు, 108 కొబ్బరి కాయల నీళ్లతో మరియు పెరుగు, తేనె, పసుపు, గంధము తదితర ద్రవ్యములతో మహాశాంతి అభిషేకం నిర్వహించి అనంతరం తిరుప్పావడ సేవ నిర్వహించారు.. రాత్రి 08.00 గంటల నుండి 09.00 గంటల వరకు అద్దాల మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఉత్సవం మూర్తులను వేంచేపు చేసి శయనోత్సవం నిర్వహించారు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నిర్వహించిన వాహన సేవలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.. ఏ ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవములు విజయవంతంగా ముగిసాయి… అందుకు సహకరించిన ఉభయదారులకు, పుంగనూరు పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, రెవెన్యూ శాఖ వారికి, విద్యుత్తు శాఖ వారికి, ప్రభుత్వ ఆసుపత్రి వారికి, ప్రత్యేకించి బ్రహ్మోత్సవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి అధిక సంఖ్యలో భక్తులు వాహన సేవలకు హాజరయ్యేందుకు సహకరించిన ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ టీటీడీ యజమాన్యం తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు.. కృష్ణ మూర్తి, ఆలయ ఇన్స్పెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *