సెంటినరీ కాలనీ సింగరేణి క్వాటర్స్ లో బోర్ వెల్స్ మరమ్మత్తులు

* 3లక్షల 80 వేల నిధులు మంజూరు చేసిన ఆర్జి-3 జి ఎం

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి సెంటినరీ కాలనీ -07:- సెంటనరీ కాలనీలో సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికులకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్వెల్ రిపేర్ కోసం డీజీఎం సివిల్ బి.రాజేంద్రకుమార్ ప్రతిపదన పెట్టగా జిఎం ఆర్జి త్రి మధుసూదన్ రావు 3లక్షల 80 వేల నిధులు సాంక్షన్ చేశారు. ఇట్టి బోర్వెల్ మరమ్మత్తు పనులు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో (ఐ.ఎన్.టి.యు.సి) వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, (ఏ.ఐ.టి.యు.సి) బ్రాంచ్ కార్యదర్శి ఎం రామచందర్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి సెంట్రల్ నాయకులు ఏ, రామారావు, ఏఐటీయూసీ రెసిడెన్షియల్ కార్యదర్శి సతీష్,సింగరేణి సూపర్వైజర్ బెల్లం శీను, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *