పయనించే సూర్యుడు, మార్చి 7, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలో గల కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గల కిచెన్ ను సందర్శించి కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా అని అలాగే వంట సరుకుల నాణ్యతను గుడ్లను నీటిలో వేసి వాటి నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పాఠశాలను ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు గురించి ఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఉదయం అల్పాహారం ఏం పెట్టారు? ఎలా ఉంది? అని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ఓ గీత, తదితరులు పాల్గొన్నారు.