పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 07 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ వైసీపీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దకడబూరు గ్రామ సర్పంచ్ ఎం.రామాంజినేయులు నియమితయ్యారు. శుక్రవారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. నియామకంపై తనపై నమ్మకాన్ని వ్యక్తం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికు రామాంజినేయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలో చేతివృత్తుల విభాగం కార్యాచరణ మరింత సమర్థవంతంగా మరియు బలోపేతం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.