పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 07 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ రాష్ట్రంలో పేద కుటుంబాల పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధలో భాగంగా పెద్దకడబూరు మండలంలోని మేకడోని గ్రామానికి చెందిన రెడ్డి అహ్మద్ ఇటీవల అప్రెండెక్స్ శస్త్రచికిత్స (ఆపరేషన్) చేసిన తరువాత, ఆయనకు సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా రూ.70,780 మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యుడు కురువ మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, బొగ్గుల నరసన్న, సీనియర్ నాయకులు అజర్ వలి, అందుమిమ, మాజీ ఎంపీటీసీ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. పేదలు, రైతులు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తాయని అన్నారు.