
పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ 08-03-2026 కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, వుమన్ ఎం పవర్ కమిటీ సమన్వయకర్త డాక్టర్ లక్ష్మీ మంగమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి అమ్మాయి యొక్క తల్లి తండ్రితో తన చదువుకు సంబంధించిన విషయాలు ప్రతి రోజు కనీసం రెండు నిమిషాలు మాట్లాడిన ఎడల మరియు ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాము అని మననం చేసుకోవడం వలన సమాజంలో పరిపక్వ స్త్రీగా తయారవుతారని తెలియజేశారు. డబల్యూ ఈ సి సమన్వయకర్త లక్ష్మీ మంగమ్మ మాట్లాడుతూ కళాశాలలో ఆనవాయితీగా వస్తున్న వివిధ గ్రూపుల టాపర్స్ యొక్క తల్లిదండ్రులను కళాశాలలో ఈ రోజున సన్మానించుకోవడం స్త్రీ సాధికారత మరియు అభివృద్ధి చెందే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని విన్నవించారు. తృతీయ సంవత్సరం నుండి గాయత్రి, మాధవి, దివ్య, ఏ గాయత్రి, హాని, ద్వితీయ సంవత్సరం నుండి వసంత, వెంకటలక్ష్మి, ప్రవల్లిక, త్రివేణి, రేణుక, తల్లులను ఉమెన్ ఎంపవర్ కమిటీ మరియు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం వారిని ఘనంగా సన్మానించారు. డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య శ్రీ, ఐ క్య్ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డి.మాల్యాద్రి, కళాశాల సీనియర్ అధ్యాపకులు వి.అప్పలనాయుడు,డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ మళ్ళీబాబు, డాక్టర్ శ్రీవెంకటేష్, సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు, హేమ గణేష్,ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.