పాలకుర్తి కొడకండ్ల మార్కెట్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి

* మంత్రి తుమ్మలను కోరిన పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 8 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి హైదరాబాద్ కార్యాలయంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పాలకుర్తి నియోజకవర్గంలోని పలు వ్యవసాయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని, రైతులు తమ పంటలను విక్రయించేందుకు సరైన వసతులు కల్పించేందుకు మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని,ముఖ్యంగా రైతులకు తగిన నిల్వ గోదాములు, తాగునీటి సదుపాయం, షెడ్లు, రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నిధులు అవసరమని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.ఎమ్మెల్యే వినతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి, పాలకుర్తి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను తక్షణమే ఆదేశించారు.రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *