తల్లాడ మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 8, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో ఇటీవల నూతన గృహ ప్రవేశం నిర్వహించుకున్న చందా వెంకటేశ్వర ఆహ్వానం మేరకు సండ్ర వెంకట వీరయ్య వారి ఇంటికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్ లాల్, పెనుబల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకటరావు, అంజనాపురం సర్పంచ్ నల్లగొండ కృష్ణయ్య, రాధా, ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు, కిన్నెర వెంకటేశ్వరరావు, భూక్య రాము, రామోజీ , సాయిని ప్రసాద్, వెంకటప్పయ్య, భద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *