పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 8 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51 వ డివిజన్ లక్ష్మి నగర్ కాలనీలో సమావేశం అయిన జిల్లా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా గుర్తించి ప్రతి నెల 50,000 వేల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం కార్పొరేట్ హాస్పిటల్ లో ఉచిత వైద్య సౌకర్యాలు కొరకు హెల్త్ కార్డు ఇవ్వాలని మరియు తెలంగాణ ఉద్యమ కారులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సమావేశం లో డిమాండ్ చేసినది గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీ ఆర్ ఎస్- బి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను పట్టించుకోక పోవడం మూలాననే బీ ఆర్ ఎస్ నియంతృత్వ ప్రభుత్వాన్ని రాష్ట్రం లో ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రం లో అధికారం లోకి తీసుకు రావడానికి తెలంగాణ ఉద్యమ కారులు తమ వంతు బాధ్యతను విశేషంగా కృషి చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచిపోకూడదని 2023 ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఈ సమావేశం విజ్ఞప్తి చేసినది అదే విధంగా ఇటీవల రాష్ట్ర హై కోర్టు తెలంగాణ ఉద్యమ కారులకు పెన్షన్ ను 250 గజాల ఇంటి స్థలం 8 వారాల్లోగా ఇవ్వాలని గౌరవ హై కోర్టు తీర్పును ఈ సమావేశం స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసినది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో ఏర్పడిన పొలిటికల్ జే ఏ సి ఇచ్చిన ప్రతి ఉద్యమానికి స్పందించి లక్షలాది మంది ఉద్యమ కారులు రైల్ రోకో రాస్తా రోకో సాగరహారం మరియు మిలియన్ మార్చ్ జైల్ బారో తదితర ఎన్నో ఉద్యమలలో పాల్గొన్న ఉద్యమ కారుల పై అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారుల పై ఎన్నో కేసులు పెట్టి ఉద్యమ కారులను జైళ్ల పాలు చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ సమావేశం గుర్తు చేస్తున్నదని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నష్టపోయిన తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమ కారులను తెలంగాణ అమర వీరుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఉద్యమ కారులను వారి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్నదని ఈ సమావేశం పేర్కొన్నదిఈ సందర్భంగా తెలంగాణ అమర వీరులకు జోహార్లు అని
తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యత వర్ధిలాలి అని తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేసినారు ఈ సమావేశంలో జిల్లా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఉపాధ్యక్షుడు బూర్ల జ్ఞాని కార్యదర్శి అడిచర్ల రాజేశం కార్యవర్గ సభ్యులు నాయకులు చిప్ప రామస్వామి ఎం సత్యనారాయణ వెంకటేష్, కొండా శంకర్ డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు