ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. సిపిఐ

పయనించే సూర్యుడు మార్చి 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ మండల కార్యదర్శి కల్లుబావి రాజు తదితరులు అన్నారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయము నందు సిపిఐ మండలం ( 1) మండల సహాయ కార్యదర్శి కొత్తూరు గంగన్న అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలము ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నగదు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ప్రతి గ్రామములో గడప గడప కు సిపిఐ కార్యక్రమంతో అన్ని గ్రామాలలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని మోసం చేశారని గ్రామాలలో వృద్ధాప్య పింఛన్ వికలాంగుల పెన్షన్ వితంతు పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని గ్రామాలలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించకుండా గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కూడా విఫలము చెందిందన్నారు. ఉపాధి హామీ కార్మికుల కడుపు కొట్టేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి వి బి జి రాంజీ పథకాన్ని అమలు చేసి కార్మికులను నిలువునా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఈనెల 24వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున లబ్ధిదారులను సమీకరించి ధర్నా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు చిన్నపిండేకల్ హనుమంతు మండగిరి శేషప్ప దొడ్డనగిరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *