
పయనించే సూర్యుడు, కోరుట్లమార్చి 8 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని స్థానిక పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ (బాలికల) ఉన్నత పాఠశాలలో సైన్స్ డ్రామా ప్రదర్శించిన విద్యార్థినులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవం, ప్రేరణాత్మక సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి (డి ఎస్ ఓ )రాజశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వడ్లకుండ గంగాధర్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ధరిత్రీ మాత ఆవేదన’ అనే సైన్స్ డ్రామా ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన విద్యార్థినులను డీఎస్ఓ రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. స్కూల్ అసిస్టెంట్ (బయో-సైన్స్) మరియు మెంటర్ జనాబ్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ గారు మాట్లాడుతూ” ది బయో సైన్స్ ఫోర్స్ -దునియా బద్లేగి “, లక్ష్యం విద్యార్థినుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమేనని పేర్కొన్నారు. సైన్స్ డ్రామాలో అద్భుత ప్రతిభ కనబర్చి, జిల్లా సైన్స్ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థినులు ఆయేషా సిద్దిఖా, హనియా మునజ్జా, ఫాతిమా సుల్తానా, అమ్రా మహ్వేష్, అదీబా బేగం, జవేరియా మహమూద్ అలీ, షిఫా ఫాతిమా, ఆఫియా సిద్దిఖా, సిమ్రా మహీన్, సుమేరా మహీన్. మాజీ ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హెడ్ గర్ల్ ఆయేషా సిద్దిఖా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకోగా, అదీబా బేగం, మదిహా నాజ్ మరియు అఫ్షా ఫిర్దౌస్ తమ ప్రసంగాల ద్వారా సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.