పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 8 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతసాగరం మండల కేంద్రంలోని టీజేఎన్ జడ్‌పీ హై స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైఎస్సార్‌సీపీ టీచర్స్ వైస్ ప్రెసిడెంట్ మెట్టుకూరు సుబ్బారెడ్డి మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యంగా విద్యారంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనంతసాగరం లైబ్రేరియన్ డి. నారాయణరావు, పాఠశాల సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.