పయనించే సూర్యుడు మార్చి 8 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం వ్యవసాయ మహిళా కూలీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రూపొందించిన పాంప్లెట్‌ను విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. ఈశ్వరమ్మ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, గౌరవం, సమానత్వానికి ప్రతీక అని తెలిపారు. అయితే దేశంలో ఇప్పటికీ మహిళలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ కలిసి న్యాయపోరాటం చేయాలని సూచించారు. అలాగే రేపు నిర్వహించనున్న ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.