సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలి.

* మండల ఎంపీడీవో శ్రీనివాస్. * గ్రామంలో పర్యటించిన ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్ : గ్రామంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సాలూర మండల ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో శనివారం సాలూర మండలం సాలూర క్యాంపు గ్రామంలో పర్యటించి, గ్రామపంచాయతీ, పాఠశాల మరియు నర్సరీలో సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు.పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్నిపరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనను గురించి ఉపాధ్యాయులను అడిగి. తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనితెలిపారు. నర్సరీలో నిబంధనల మేరకు మొక్కలను పెంచాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *