విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

* విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఎంఈఓ ఇర్రి వెంకటరెడ్డి

పయనించే సూర్యుడు, మార్చి 8, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల దబ్బగుంటపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఇర్రి వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చదువుకున్న పాఠశాలకి,గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఎంఈఓ గా కుమార్ హెచ్ఎం గా లిఖిత ఉపాధ్యాయులుగా భవ్య శ్రీ, నిత్య, వైష్ణవి, అర్చన,ఠాగూర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అమీర్,గొట్టె కనకయ్య, దీక్షిత మమత, పద్మ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *