14న ఎమ్మెల్యే, ఎంపీల ఇఫ్తార్ విందుపుంగనూరు: రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 08.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలుకలసి ముస్లింలకు ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వ నున్నారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి యేటా నిర్వహించే రీతిలో పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వను న్నట్లు తెలిపారు. అంజుమన్ షాదీ మహల్లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *