సిరిపురం: ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యడు మార్చి 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం సిరిపురం ప్రాథమిక పాఠశాల-2లో శనివారం ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నూతన ఎంఈఓ. వనం సత్యనారాయణ మాట్లాడుతూ- మహిళలు,పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్నారన్నారు.ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళల్లో కాలానుగుణంగా చైతన్యం వస్తుందన్నారు.అలాగే మహిళల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం మహిళ టీచర్లను శాలువలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం. బుర్రి శ్రీనివాసరావు,సీనియర్ ఉపాధ్యాయులు కె.సుజాత, వి.జ్యోతి, వై.వెంకన్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మొక్క.నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్ నేలమరి.శైలజ, తల్లులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *