పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 08 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ గ్రామ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలోని భీమరాయుడు గుడి వెనకాల రూ.10 లక్షలతో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులను మంజూరు చేశారు. డ్రైనేజీ సమస్యపై గ్రామస్తుల మధ్య ఏర్పడిన వివాదాన్ని ఆయన స్వయంగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముక్కన్న, కురువ శీను, ఇంజినీరింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.