శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక

పయానించే సూర్యుడు న్యూస్ 8 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ ​చేగుంట మండల కేంద్రంలోని స్థానిక శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికే ‘ఫేర్‌వెల్ పార్టీ’ వేడుకలు శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ప్రముఖ సంఘ సంస్కర్త అయిత పరంజ్యోతి విచ్చేశారు. విద్యార్థులు తమ పాఠశాల ప్రయాణంలో ఎదురైన మధుర జ్ఞాపకాలను, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వేదికపై పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సర్పంచ్ స్రవంతి సతీష్ చేతుల మీదుగా విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ద్యావ రేణుక లింగమూర్తి, డైరెక్టర్ పులబోయిన నాగరాజు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *