టిటిడి ఈ.వో ను కలిసిన శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట

పయనించే సూర్యుడు-09-03-2026-రాజంపేట న్యూస్ : టిటిడి నూతన ఈ.వో గా ఇటీవలే నియమింపబడిన ముద్దా రవిచంద్ర ను శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆదివారం తిరుమలలో వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి శేష వస్త్రము, ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గతంలో దోర్నాల వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన డార్మెటరీ మరియు చౌల్ట్రీ గురించి వారితో చర్చించడం జరిగిందని, వచ్చే బోర్డు సమావేశంలో దానిమీద చర్చిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని పోతుంగుంట తెలియజేశారు. అలాగే టీటీడీ ఏ.ఈ.ఓ వెంకయ్య చౌదరి ని కూడా వారి క్యాంప్ కార్యాలయంలో కలిసి స్వామివారు, అమ్మవార్ల వస్త్రము, ప్రసాదము అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *