జగ్గయ్యపేట మున్సిపాలిటీకి ‘ప్రత్యేక గ్రేడ్’ హోదా: చారిత్రాత్మక విజయంపై ఎమ్మెల్యే తాతయ్య , చైర్మన్ రాఘవేంద్ర హర్షం!

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కౌన్సిల్.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 9: జగయ్యపేట పట్టణంలోని ఈరోజు జగ్గయ్యపేట మున్సిపాలిటీని గ్రేడ్-2 స్థాయి నుండి ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం పట్ల పట్టణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేడు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) గ, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర మరియు కౌన్సిలర్లు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి మరియు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర కృతజ్ఞతా పూర్వక ప్రసంగం: “ఈరోజు జగ్గయ్యపేట సాధించిన ఈ గొప్ప విజయం వెనుక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, అంకితభావం దాగి ఉన్నాయి. అభివృద్ధి పట్ల నిరంతరం తపించే మన ముఖ్యమంత్రి , జగ్గయ్యపేట పట్టణ అవసరాలను గుర్తించి, వెంటనే స్పందించి ఈ గెజిట్ విడుదల అయ్యేలా చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, మున్సిపల్ శాఖా మంత్రివర్యులు పొంగూరు నారాయణ మన విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించి, సాంకేతిక ప్రక్రియను వేగవంతం చేసి, ప్రత్యేక మున్సిపాలిటీ హోదా దక్కేలా సహకరించినందుకు వారికి జగ్గయ్యపేట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గత నెల రోజులుగా కౌన్సిల్ తీర్మానాన్ని భుజాన వేసుకుని, అమరావతి స్థాయిలో నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఈ కల సాకారమైంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా శానిటేషన్, మౌలిక వసతుల కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి, స్పెషల్ గ్రేడ్ సాధించడం ద్వారా జగ్గయ్యపేటను అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు ఈ అవకాశం దక్కింది. పరిపాలనా సంస్కరణలతో పాటు, కేంద్ర-రాష్ట్ర నిధుల ద్వారా పట్టణ రూపురేఖలను మార్చేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.” ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) కీలక ప్రసంగం: “జగ్గయ్యపేట అభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి. కేవలం గ్రేడ్ మారడమే కాదు, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే నా ఆశయం. నిధుల వెల్లువ: స్పెషల్ గ్రేడ్ హోదాతో కేంద్ర ప్రభుత్వ ’15వ ఆర్థిక సంఘం’ గ్రాంట్లు మరియు రాష్ట్ర నిధులు భారీగా విడుదలవుతాయి. అధికారుల నియామకం: ప్రత్యేక మున్సిపల్ అధికారులు, పెరిగిన పారిశుద్ధ్య సిబ్బందితో పట్టణాన్ని మరింత శుభ్రంగా ఉంచుతాం. మాస్టర్ ప్లాన్ అమలు: సిఆర్ డిఏ పరిధిలో జగ్గయ్యపేటను ఒక మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. శానిటేషన్ వైఫల్యాలను సరిదిద్ది, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే మా తక్షణ లక్ష్యం. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మరియు కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం.” ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *