మహిళలకు స్వాతంత్ర్యం కల్పించిన మహనీయులు అంబేద్కర్

పయనించే సూర్యుడు 9-3-2026 గొల్లపల్లి మండల ప్రతినిధి (ఆవుల చందు ) గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్,ఆధ్వర్యంలో గౌరవ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామ స్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధిగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గొల్లపెల్లి మండల సభ్యులు సాతల లక్ష్మణ్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళిలు అర్పించారు.. అనంతరం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గొల్లపెల్లి మండల సభ్యులు సాతల లక్ష్మణ్, మాట్లాడుతూ అంబేద్కర్ మహిళలు స్వతంత్రంగా ఉండాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో అవకాశాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ ఈ భారత దేశంలో మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం వల్ల మన దేశాన్ని పాలించే మొదటి మహిళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఇందుకు నిదర్శనం అని తెలిపారు. ముందుగా మహిళ మహాలక్ష్మి లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, కార్యక్రమంలో చిన్నారి రాజబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పోలకళ రాజ గణేష్, పొన్నగంటి రాజరత్నం,మేకల ప్రేమ బంధం, తుడుం నరసయ్య,శ్రీకోటి నీలకంఠం, సజ్జనపు రవి, సరసాన్ని అనిల్ రెడ్డి, తుడుం దుర్గయ్య,తడగొండ హరీష్, గ్రామస్తులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *