అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 9 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (H హెచ్ పి యు) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నది ఈ సందర్భంగా యుక్త వయస్సు బాలికలకు స్వయంగా టీకాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన సూచించారు గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ఉండేందుకు ఈ హెచ్‌పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు , మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ , వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ , మెడికల్ స్పెషల్ ఆఫీసర్ మౌనిక , వినాయకపురం స్పెషల్ ఆఫీసర్ రాందాస్ , సిహెచ్ఓ అమరావతి హెచ్ వి దుర్గ , హెచ్ ఏ లు గోపాల్ , ప్రసాద్ , సతీష్ , ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *