బోధన్‌లో టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 9 బోధన్ : బోధన్ పట్టణంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ సమాజ హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎమ్మార్పీఎస్ మాదిగ సహోదరులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ లంక రవి కి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *