బోధన్ పట్టణంలో ఘనంగా సేవాలాల్ జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 9 బోధన్ : బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో సేవాలాల్ 287 జయంతి సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాలు బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బంజారా పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు రాష్ట్ర ప్రభుత్వ చల్లదారులు బోధన్ ఎమ్మెల్యే కే సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, పిసిసి డెలిగేట్ గంగా శంకర్ బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ షీలా శంకర్,ఒకటో వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి, బంజారా సేవా సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *