అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు మహిళ వార్డు సభ్యులు మహిళ పారిశుధ్య కార్మికులు పాలకవర్గంతో కలిసి కేక్ కట్ చేసిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు మార్చి 9 ఖానాపూర్ మండలం నర్సంపేట నియోజకవర్గం రిపోర్టర్ కామని ప్రమోద్ ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర మహిళ కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికి కూడా ఆధార స్తంభమని అన్నారు తల్లి ఉపాధ్యాయురాలు వైద్యురాలు నాయకురాలు శాస్త్రవేత్తగా ఎన్నో రంగాల్లో మహిళలు గొప్ప సేవ చేస్తున్నారు ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకుంటుంది అనే మాట నిజమని అందుకే మహిళా శక్తిని గౌరవించడం ప్రతి సమాజం యొక్క బాధ్యతనీ అన్నారు భారతీయ సంస్కృతిలో మహిళ స్థానం మహిళను శక్తి స్వరూపిణి గా భావిస్తారనీ అన్నారు తల్లి ప్రేమ త్యాగం సేవభావం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని అన్నారు అందుకే మహిళను గౌరవించే సంస్కృతి మనకు ఉన్న గొప్ప సంప్రదాయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదనీ ఇది మహిళల గౌరవం సమానత్వం మరియు హక్కుల కోసం ప్రపంచానికి గుర్తు చేసే రోజు అని అన్నారు ప్రతి కుటుంబం ప్రతి సమాజం మహిళలను గౌరవించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందనీ అన్నారు మహిళను గౌరవించే సమాజమే సుస్థిరమైన సమాజం అందుకే మనందరం మహిళల సేవలను గుర్తించి వారి గౌరవాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి అలాగే ప్రపంచంలో ధీర వంటలను ఆదర్శంగా తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం మహిళా వార్డు సభ్యులు కంకణ బద్ధులై పని చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి భూక్య స్రవంతి ఈలపొంగు కొమురమ్మ అరిఫా గుండ్లపెళ్లి మంజుల గుండ్లపెళ్లి విజయ్ చలిగంటి మల్లికార్జున్ ఎండి అజహార్ సీనియర్ అసిస్టెంట్ పేర్ల రాములు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *