ఉత్తమ ఫలితాలు సాధనే ఏపీ ఆదివాసీ జేఏసీ,ఏటిఏ లక్ష్యం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 10.2026 పోలవరం జిల్లా, దేవీపట్నం మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు తెల్లం శేఖర్, కారం రామన్న దొర, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటిఏ) మండల నాయకులు చిచ్చడి శేషారావు, సోడే కన్నం రాజు పరీక్ష కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, ఇందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థులకు పరీక్ష కిట్టు అందజేశామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు దేవీపట్నం మండలాన్ని రాష్ట్రస్థాయిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ (ఏటిఏ) మండల నాయకులు చిచ్చడి శేషరావు, సోడే కన్నం రాజు మాట్లాడుతూ విద్యార్థులు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలకు మరియు మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.వెంకటేశ్వరరావు (శ్రీనివాస్), కె.కృష్ణారెడ్డి, చవలం సత్యనారాయణ దొర, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *