రెడ్డిపల్లి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పయానించే సూర్యుడు న్యూస్ మార్చ్ 10 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండలం, ప్రాథమిక పాఠశాల రెడ్డిపల్లి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పాఠశాలలోని ఉపాధ్యాయినీలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవాత్ సురేష్ మాట్లాడుతూ మనకు ప్రేమ, సహనం, త్యాగం నేర్పేది మహిళలే అని, సమాజం లో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించి మహిళల సమస్యలు పరిష్కరించడం, మహిళల హక్కులను కాపాడడం వారిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నేడు మహిళలు ప్రపంచంలో అన్ని రంగాలలో అనగా సామాజికంగా, రాజకీ యంగా, ఆర్ధికంగా, ఉద్యోగ పరంగా అనేక రంగాల్లో ముందుకెళుతుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులను సుమతి, రజనీదాస్, సుమలత, మౌనిక ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రామకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *