పయనించే సూర్యుడు- 10-03-2026-రాజంపేట న్యూస్ : రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బిజెపి రాయలసీమ జోనల్ ఇన్చార్జి మొగరాజు రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళా పారిశుధ్య కార్మికులకు జ్ఞాపిక, చీరలు బహుకరించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మొగరాజు రమణయ్య మాట్లాడుతూ వాతావరణం కాలుష్యం కాకుండా మరియు అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్మికులు చెత్తాచెదారం, కుళ్ళిన వివిధ రకాల జంతు కళేబరాలను వారి హస్తములతో తొలగించి మానవాళికి మంచి ఆరోగ్యానికి కృషి చేస్తున్నారని, కానీ వారి జీవితాలు చాలాదుర్భరంగా ఉన్నాయని, వారికి అందవలసిన జీతభత్యాలు గానీ, జీవిత భద్రతకు చెందిన ఎలాంటి సహాయాలు అందలేదని, వీరి సర్వీసులు కూడా క్రమబద్ధీకరించకపోవడం చాలా శోచనీయమని, ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఇందులో పట్టణ అధ్యక్షులు వి.వి రమణ, బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఈటిమాపురం సుబ్రహ్మణ్యం, నరేష్, రాజంపేట పట్టణ ఉపాధ్యక్షులు వై.రమణ, ప్రధాన కార్యదర్శి ఎన్.గిరీష్, బిజెపి సీనియర్ నాయకులు తోటా నాగేష్, ధనాసి రమణ, ధనాసి నరసింహులు, రామపురం రమణయ్య, రంప శ్రీనివాసులు, నందలూరు మండల అధ్యక్షులు చుక్క శ్రీనివాసులు, జయ కుమార్ రెడ్డి, మురళి, పుల్లంపేట మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు, హస్తవరం మాజీ మండల మహిళ అధ్యక్షులు ప్రభావతమ్మ, అమృతవల్లి, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.